జగన్ గారూ, ఆ నేర్పరితనం ఇంకా ప్రదర్శిస్తున్నారా?: నారా లోకేశ్
- నాడు ప్రభుత్వంపై వరల్డ్ బ్యాంక్ కు తప్పుడు మెయిల్స్ పంపారు
- పేటీఎం బ్యాచ్ తో ఫేక్ ట్వీట్లు, లెటర్లు రాయించారు
- ఎన్నికల కమిషనర్నీ ‘కులం’ పేరుతో దూషిస్తారా?
మీ రౌడీ రాజ్యానికి అడ్డుపడ్డారని, ఎన్నికల కమిషనర్నీ, ఆయన కుటుంబాన్ని ‘కులం’ పేరుతో దూషించారంటూ జగన్, మంత్రులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా పాలించమని అధికారమిస్తే, నియంతలా మారి, ‘నిజస్వరూపం బయటపెట్టుకున్న మీరు ఇంకెన్ని వ్యవస్థల్ని భయపెడతారు?‘ అని లోకేశ్ ప్రశ్నించారు.