Jagan: జగన్‌ సర్కారు విజ్ఞప్తికి ఏపీ ఎన్నికల సంఘం గ్రీన్‌ సిగ్నల్‌

ec on jagan govt request
షార్ట్స్‌లో చూడండి
ఉగాది పండుగ సందర్భంగా ఈ నెల 25వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో 26 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు జగన్‌ సర్కారు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్‌ను కూడా ఎత్తేస్తూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో ఏపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోంది.

ఈ నేపథ్యంలో ఇళ్ల పట్టాల పంపిణీకి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీనిపై ఈసీ స్పందించింది. ఉగాది రోజున ఇళ్ల పట్టాల పంపిణీకి అభ్యంతరం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటన చేసింది. దీంతో పండుగ రోజునే  26 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందే కార్యక్రమం ప్రారంభం కానుంది.
Go Back to Shorts
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News