Jagan: జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఏప్రిల్ 9కి వాయిదా
హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ, ఈడీ కోర్టులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఈ రోజు కొనసాగింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న విశ్రాంత అధికారులు మన్మోహన్‌సింగ్, రాజగోపాల్ విచారణకు హాజరయ్యారు. వారిని విచారించిన అనంతరం ఈ కేసు వాయిదా పడింది.
తదుపరి విచారణను ఏప్రిల్ 9న చేపడతామని సీబీఐ, ఈడీ కోర్టు తెలిపింది. ఈ కేసులో మరికొందరు నిందితులైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు శ్యామ్ ప్రసాద్ ఇటీవల జరిగిన విచారణకు హాజరైన విషయం తెలిసిందే.