ఐపీఎల్ సంగతి బీసీసీఐ చూసుకుంటుందన్న కేంద్ర మంత్రి
- దేశంలో కరోనా విజృంభణ
- ఐపీఎల్ పోటీలు ఏప్రిల్ 15కి వాయిదా
- మరోసారి సమీక్ష తర్వాత నిర్ణయం
ఐపీఎల్ జరగడం అనేది ఇప్పుడు ముఖ్యం కాదని, ప్రజల ఆరోగ్యమే ఇప్పుడు ప్రాధాన్య అంశమని స్పష్టం చేశారు. ఏప్రిల్ 15 తర్వాత అప్పటి పరిస్థితులను సమీక్షించి తాజా నిర్ణయం తీసుకుంటారని, క్రికెట్ ఒలింపిక్ క్రీడ కాదు కాబట్టి ప్రత్యేక సంఘమైన బీసీసీఐ ఐపీఎల్ గురించి సమీక్షిస్తుందని తెలిపారు. మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ తాజా సీజన్ కరోనా ఉద్ధృతి కారణంగా ఏప్రిల్ 15 వరకు వాయిదా పడిన సంగతి తెలిసిందే.