ISS: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం... అత్యంత సురక్షిత ప్రాంతం: నాసా

No corona virous problem to Iss
షార్ట్స్‌లో చూడండి

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపధ్యంలో భూ ఆవరణలో వైరస్ సోకని అత్యంత సురక్షిత ప్రాంతం ఏదైనా ఉందంటే 'అది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)' కేంద్రం ఒక్కటే అంటున్నారు నాసా శాస్త్రవేత్తలు. ప్రస్తుతం 164 దేశాలకు కరోనా విస్తరించింది. 2 లక్షల మంది దీని బారిన పడగా దాదాపు 8 వేల మంది మృత్యువాత పడ్డారు. ఈ మహమ్మారి నుంచి బయటపడేందుకు ప్రపంచ దేశాలు వైరస్ పై యుద్ధమే చేస్తున్నాయి. 

ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ సోకని సురక్షిత ప్రాంతం ఈ భూమండలం మీదే లేదంటున్నారు నిపుణులు. అయితే భూ సమీప కక్ష్యలో తిరుగుతున్న స్పేస్ స్టేషన్ సురక్షితమంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే, సుమారు ఇరవై ఏళ్లలో ఈ స్టేషన్లోని ఓ ఆస్ట్రోనాట్ కు జలుబు మాత్రమే చేసిందట. ఈ కేంద్రంలో హెల్త్ స్టెబిలైజేషన్ ప్రోగ్రాం కొన్నాళ్లుగా కొనసాగుతున్నందున ఈ కేంద్రానికి వైరస్ సోకే చాన్స్ లేదు. ఈ కేంద్రానికి పంపించే వారికి పది రోజులపాటు అన్ని వైద్యపరీక్షలు చేసిన తర్వాతే వారిని అనుమతిస్తారు.

Go Back to Shorts
ISS
Corona Virus
safe place

More Telugu News