మీ బాధ ఏమిటో అర్థం చేసుకున్నా: మధ్యప్రదేశ్ స్పీకర్ పై గవర్నర్ అసహనం
- ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించడం గొప్ప విషయం
- మీ సమర్థతను, పారదర్శకతను అభినందిస్తున్నా
- మిగిలిన ఎమ్మెల్యేల రాజీనామాల తిరస్కరణపై డైలమాలో ఉన్నా
ఇళ్లకు దూరంగా వేరే ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేల గురించి మీరు చెందుతున్న ఆందోళనను తాను అర్థం చేసుకున్నానని లేఖలో గవర్నర్ పేర్కొన్నారు. గత 8-10 రోజులుగా మీరు ఎంత ఆవేదన చెందుతున్నారనే విషయాన్ని అర్థం చేసుకోగలనని చెప్పారు. ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించే నేపథ్యంలో, మీ సమర్థతను, పారదర్శకతను తాను అభినందిస్తున్నానని అన్నారు. మిగిలిన ఎమ్మెల్యేల రాజీనామాలను తిరస్కరించడంపై కొంచెం డైలమాలో ఉన్నానని చెప్పారు.