మానవ అక్రమ రవాణా కేసు.. టర్కిష్ కోర్టు సంచలన తీర్పు
- అప్పట్లో గుండెలు పిండేసిన చిన్నారి కుర్దీ మరణం
- 8 మంది సామర్థ్యం కలిగిన బోటులో 16 మంది తరలింపు
- ఘటన జరిగిన నాలుగున్నరేళ్లకు శిక్ష
కుర్దీ కుటుంబం సహా మరికొందరిని టర్కీ నుంచి గ్రీకుకు తరలిస్తుండగా జరిగిన ప్రమాదంలో కుర్దీ కుటుంబం సహా పలువురు మృతి చెందారు. 8 మంది సామర్థ్యం కలిగిన ప్లాస్టిక్ బోటులో ఏకంగా 16 మందిని ఎక్కించి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణం మొదలైన కాసేపటికే బోటు సముద్రంలో మునిగిపోయింది. కుర్దీ కుటుంబాన్ని అక్రమంగా తరలించేందుకు దోషులు 6 వేల డాలర్లు వసూలు చేశారు. కాగా, ఈ కేసులో దోషులైన మరికొందరికి కూడా కోర్టు జైలు శిక్ష విధించింది.