Sunil Deodhar: కార్యకర్తలపై దాడిని బీజేపీ-జనసేన కూటమి తేలిగ్గా తీసుకోదని గుర్తుంచుకోండి: సునీల్ దేవధర్

Sunil Deodhar comes in support for BJP and Janasena cadre
  • తమ కార్యకర్తలపై వైసీపీ గూండాలు దాడులు చేస్తున్నారన్న దేవధర్
  • పోటీ చేయనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణ
  • కార్యకర్తలకు అండగా ఉంటామని ఉద్ఘాటన
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తమ అభ్యర్థులు, కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ దేవధర్ ఆరోపించారు. కార్యకర్తలపై జరుగుతున్న దాడులను బీజేపీ-జనసేన కూటమి తేలిగ్గా తీసుకోదని వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. కార్యకర్తల కోసం ఎంతవరకైనా వెళతామని స్పష్టం చేశారు. "స్థానిక సంస్థల ఎన్నికలు జరపాల్సిందేనని హైకోర్టు ఆదేశించిన తర్వాత వైసీపీ గూండాలు బీజేపీ-జనసేన కార్యకర్తలపై దాడులకు ఉపక్రమించాయి. వారిని పోటీ చెయ్యనివ్వకుండా అడ్డుకున్నారు. ఇదే జగన్ నాడు టీడీపీ పాలన సందర్భంగా ప్రజాస్వామ్యం మంటగలుస్తోందంటూ గగ్గోలు పెట్టాడు" అంటూ సునీల్ దేవధర్ ట్వీట్ చేశారు.
Sunil Deodhar
BJP
Janasena
YSRCP
Local Body Polls
Andhra Pradesh

More Telugu News