'వకీల్ సాబ్' కోసం రంగంలోకి లావణ్య త్రిపాఠి
- షూటింగు దశలో 'వకీల్ సాబ్'
- హిందీ .. తమిళభాషల్లో ఆదరణ పొందిన కథ
- త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు
తాజాగా మరో కీలకమైన పాత్ర కోసం లావణ్య త్రిపాఠిని ఎంపిక చేశారని సమాచారం. ఆమె పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. ఈ పాత్ర కోసం ముందుగా ఇలియానాను .. శ్రుతి హాసన్ ను సంప్రదించారు. ఆ తరువాత ఏం జరిగిందన్నది తెలియదుగానీ, లావణ్య త్రిపాఠిని ఎంచుకున్నారు. పవన్ అభిమానులంతా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. హిందీ .. తమిళ భాషల్లో ఆదరణ పొందిన ఈ కథ, తెలుగులో ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.