మాచర్ల మొత్తం వైసీపీకి ఏకగ్రీవం!
- మండలంలో 14 ఎంపీటీసీ, 1 జెడ్పీటీసీ స్థానాలు
- ఎక్కడా కనిపించని ఇతర పార్టీల అభ్యర్థులు
- బెదిరించారంటున్న తెలుగుదేశం పార్టీ నేతలు
కాగా, కొన్ని వార్డుల్లో నామినేషన్లు దాఖలు చేసిన తెలుగుదేశం, జనసేన అభ్యర్థులను బెదిరించారని, కొన్ని చోట్ల తమ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు వెళితే, అడ్డుకున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పిన్నెల్లి ఫ్యాక్షన్ రాజకీయాలు నడిపిస్తున్నారని మండిపడుతున్నారు. గత వారంలో మాచర్లలో తమ అభ్యర్థులతో నామినేషన్లు వేయించేందుకు వచ్చిన తెలుగుదేశం పార్టీ నేతలు బొండా ఉమ తదితరుల వాహన శ్రేణిపై మాచర్లలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ కూడా చేశారు.