శ్రీలంక నుంచి వచ్చి చెన్నైలో ప్రియుడితో యువతి సహజీవనం.. ఆచూకీని గుర్తించిన పోలీసులు!

Tamilnadu Police Trace Lady from Srilanka
  • పర్యాటక వీసాపై వచ్చిన రిషేవి
  • ప్రియుడితో కలిసి చెన్నైలో మకాం
  • తండ్రి ఫిర్యాదుతో విచారించిన పోలీసులు
సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్ బుక్ లో ఏర్పడిన పరిచయంతో శ్రీలంక నుంచి వచ్చి, తమిళనాడులో ప్రియుడితో సహజీవనం చేస్తున్న యువతి రిషేవి ఫాతిమా గుప్తా (21)ను చెన్నై పోలీసులు ట్రేస్ చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, శ్రీలంకలోని రత్నపుర జిల్లా సమకిపురా రాజ్ వార్ ప్రాంతానికి చెందిన రిషేవి, జైనుల్లాబ్దీన్ అనే వ్యాపారి కుమార్తె. ఆమెకు చెన్నైలోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్న ముబాకర్ (25) అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారగా, గత నెల 26న పర్యాటక వీసాపై చెన్నైకి వచ్చిన రిషేవి ప్రియుడిని కలుసుకుని అతనితోనే ఉండసాగింది.

ఈ క్రమంలో విషయం తెలుసుకున్న జైనుల్లాబ్దీన్, దుబాయ్ నుంచి వచ్చి, తన బిడ్డ ఆచూకీ కనిపెట్టాలని కడలూరు పోలీసులను ఆశ్రయించాడు. కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు, ఆమె చెన్నైలో ఉంటోందని గుర్తించి, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆ యువతి తాను మేజర్ నని చెబుతోంది. దీంతో ప్రియుడితో వివాహం జరిపించాలా? లేక తండ్రితో పంపించాలా? అన్న విషయమై పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు.
Go Back to Shorts
Facebook
Lover
Chennai
Sri Lanka
Police

More Telugu News