జాతరకు వెళ్లిన యువతి కిడ్నాప్... రంగంలోకి దిగిన వరంగల్ పోలీసులు!
- గీసుకొండలో కొమ్మాల జాతర
- తల్లిదండ్రులతో కలిసి వెళ్లిన యువతి
- బలవంతంగా లాక్కెళ్లిన యువకుడు
వివరాల్లోకి వెళితే, అర్బన్ జిల్లా పరిధిలోని లేబర్ కాలనీకి చెందిన యువతి, తల్లిదండ్రులతో కలిసి కొమ్మాల జాతరకు వెళ్లి మంగళవారం రాత్రి అక్కడే విడిది చేసింది. జాతర చూసేందుకు బయటకు వెళ్లిన సమయంలో ఆమెను ఓ యువకుడు బలవంతంగా లాక్కుని వెళుతుంటే, ఆమె సోదరి గమనించి కేకలు వేసింది. తల్లిదండ్రులు పరుగున వెళ్లేసరికి కుమార్తె కనిపించలేదు. దీంతో ఆయన ఫిర్యాదు మేరకు కేసును రిజిస్టర్ చేసి, ఆమె కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు పేర్కొన్నారు.