జాతరకు వెళ్లిన యువతి కిడ్నాప్... రంగంలోకి దిగిన వరంగల్ పోలీసులు!

  • గీసుకొండలో కొమ్మాల జాతర
  • తల్లిదండ్రులతో కలిసి వెళ్లిన యువతి
  • బలవంతంగా లాక్కెళ్లిన యువకుడు
వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుగొండలో వైభవంగా జరుగుతున్న కొమ్మాల జాతరకు వెళ్లిన ఓ యువతి కిడ్నాప్‌ నకు గురికావడం కలకలాన్ని రేపింది. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు, వరంగల్ పోలీసులు రంగంలోకి దిగి, ఆమెను ఎటు తీసుకుని వెళ్లారన్న విషయమై ఆధారాలు సేకరిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే, అర్బన్‌ జిల్లా పరిధిలోని లేబర్‌ కాలనీకి చెందిన యువతి, తల్లిదండ్రులతో కలిసి కొమ్మాల జాతరకు వెళ్లి మంగళవారం రాత్రి అక్కడే విడిది చేసింది. జాతర చూసేందుకు బయటకు వెళ్లిన సమయంలో ఆమెను ఓ యువకుడు బలవంతంగా లాక్కుని వెళుతుంటే, ఆమె సోదరి గమనించి కేకలు వేసింది. తల్లిదండ్రులు పరుగున వెళ్లేసరికి కుమార్తె కనిపించలేదు. దీంతో ఆయన ఫిర్యాదు మేరకు కేసును రిజిస్టర్ చేసి, ఆమె కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు పేర్కొన్నారు. 

Warangal Urban District
Kidnap
Lady
Kommala Jatara

More Telugu News