రాజ్యసభ సీటును రూ.200 కోట్లకు బయటి రాష్ట్రం వ్యక్తికి కేటాయించారు: జగన్ పై దేవినేని ఉమ ఆరోపణలు
- నాడు వైఎస్ మృతికి ‘రిలయన్స్‘ని అనుమానించారు
- ఇప్పుడు ముఖేశ్ అంబానీతో కలిసి వచ్చిన వ్యక్తికే సీటు ఇచ్చారు
- రాజధాని గ్రామాల్లో ‘స్థానిక’ ఎన్నికలు ఎందుకు వాయిదా వేశారు?
తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానికి కారణం అని ‘రిలయన్స్’పై అనుమానపడ్డారని, ఇప్పుడు ఆ సంస్థ కోరిన వ్యక్తికే రాజ్యసభ టికెట్ ఇచ్చారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జగన్ పాలనపైనా ఆయన విమర్శలు గుప్పించారు. జగన్ నవమాసాల పాలనలో నవమోసాలు చేశారని మండిపడ్డారు. రాజధాని గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడం గురించి ప్రస్తావిస్తూ.. వైసీపీ ప్రభుత్వం భయపడుతోందని చెప్పడానికి ఇదే నిదర్శనమని అన్నారు.