SA Rahman: వైసీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహమాన్

Former MLA SA Rahman joins YSRCP
షార్ట్స్‌లో చూడండి
గతేడాది చివర్లో టీడీపీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహమాన్ వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా రెహమాన్ మాట్లాడుతూ, సీఎం జగన్ తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలను స్వాగతిస్తున్నామని అన్నారు.​ విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించిన రోజే వైసీపీకి మద్దతు పలికామని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విశాఖ మేయర్ పీఠాన్ని గెలిచేందుకు ధీమా వ్యక్తం చేశారు.
Go Back to Shorts
SA Rahman
Jagan
YSRCP
Vizag
Telugudesam
Andhra Pradesh

More Telugu News