ఆల్కహాల్​ తాగితే కరోనా రాదా..? డబ్ల్యూహెచ్​ వో ఏం చెప్పిందో చూడండి

09-03-2020 Mon 13:08 | Offbeat
  • ఆల్కహాల్, క్లోరిన్ ఒంటికి పూసుకుంటే వైరస్ రాదంటూ వదంతి
  • వేడి నీళ్లతో స్నానం చేస్తే కరోనా రాదనే ప్రచారాలు
  • ఇవేవీ సరికాదంటూ వివరణ ఇచ్చిన డబ్ల్యూహెచ్ వో
రోజు రోజుకు కరోనా వైరస్ మరింతగా వ్యాప్తి చెందుతుండటంతో కొత్త కొత్త వదంతులు ప్రచారంలోకి వస్తున్నాయి. ఆల్కహాల్ తాగితే కరోనా వైరస్ చచ్చిపోతుందని ఒకటి, ఆల్కహాల్ నుగానీ, క్లోరిన్ ను గానీ శరీరంపై స్ప్రే చేసుకుంటే వైరస్ పోతుందని మరొకటి, వేడి నీళ్లతో స్నానం చేస్తే వైరస్ సోకదని ఇంకొకటి.. ఇలా ఎన్నో ప్రచారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇంటర్నెట్ లో, సోషల్ మీడియాలో ఎన్నో వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) సోమవారం ప్రకటన జారీ చేసింది. ఆయా వదంతులు ప్రచారాలపై వివరణ ఇచ్చింది.

ఏ వదంతులు.. ఎలా మొదలయ్యాయి?

కరోనా వైరస్ నేపథ్యంలో హ్యాండ్ శానిటైజర్లతో ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలని డబ్ల్యూహెచ్ వో, డాక్టర్లు ప్రకటించారు. హ్యాండ్ శానిటైజర్లలో 90 శాతం వరకు ఆల్కహాల్ ఉంటుంది. మిగతా పదిశాతం మరికొన్ని రసాయనాలు ఉంటాయి. అంతేకాకుండా ఆల్కహాల్, క్లోరిన్ రెండూ సూక్ష్మజీవులను నాశనం చేస్తాయన్నది ముందు నుంచీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆల్కహాల్ తాగితే కరోనా వైరస్ చచ్చిపోతుందన్న ప్రచారం మొదలైంది. ఇదే సమయంలో ఆల్కహాల్, క్లోరిన్ ను శరీరంపై పూసుకుంటే.. వైరస్ చచ్చిపోతుందన్న వదంతి కూడా వ్యాప్తి చెందింది. ఇవి రెండూ తప్పని డబ్ల్యూహెచ్ వో వివరణ ఇచ్చింది.
  • ఆల్కహాల్ తో వైరస్ వంటి సూక్ష్మ జీవులు చనిపోతాయన్నది వాస్తవమే. అయితే మనం ఆల్కహాల్ తాగితే అది కేవలం రక్తంలో కలిసి, ఫిల్టర్ అవుతుందని, ఏ సూక్ష్మక్రిమిపైనా ప్రభావం చూపడం ఉండదని డబ్ల్యూహెచ్ వో స్పష్టం చేసింది.

  • ఇక శరీరంపై ఆల్కహాల్, క్లోరిన్ పూసుకోవడం వల్ల చర్మంపై ఉండే వైరస్ చనిపోతుందని, అంతే తప్ప అప్పటికే శరీరం లోపలికి చేరిన వైరస్ పై ఎలాంటి ప్రభావం ఉండదని వివరించింది.

  • ఆల్కహాల్ ఉండే హ్యాండ్ రబ్ లు, హ్యాండి శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవడం వల్ల ఫలితం ఉంటుందని తెలిపింది.

  • ఇక వేడి నీళ్లతో స్నానం చేస్తే వైరస్ రాదన్న ప్రచారం కూడా అవాస్తవమని చెప్పింది. అయితే వేడి నీళ్లతో గొంతు పుక్కిలించడం వల్ల కొంత ప్రయోజనం ఉంటుందని పేర్కొంది.

Corona VirusWHOAlcoholCovid19

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more