'ఢీ' మూవీ సీక్వెల్ దిశగా శ్రీను వైట్ల
- గతంలో హిట్ కొట్టిన 'ఢీ'
- కొంతకాలంగా హిట్స్ లేని శ్రీను వైట్ల - విష్ణు
- త్వరలోనే సెట్స్ పైకి
తాజా ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. తను ఇంతవరకూ చేసిన సినిమాల్లో 'ఢీ' అంటే చాలా ఇష్టమని ఆయన అన్నాడు. అన్నివర్గాల ప్రేక్షకులను ఆ సినిమా ఎంతగానో ఆకట్టుకుందని చెప్పాడు. అందువలన ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పాడు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే శ్రీను వైట్ల వెల్లడిస్తాడని అన్నాడు. చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న శ్రీను వైట్లకి .. మంచు విష్ణుకి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.