కేరక్టర్స్ పరంగా చూసుకుంటే వాళ్లెప్పుడూ నాకు సమానం కాలేరు!: సీనియర్ నటి సుధ
- నాకు వాళ్లు పోటీ అనుకోవడం లేదు
- నటిగా నాకంటూ ఒక రికార్డు వుంది
- పొగరనుకున్నా ఫరవాలేదన్న సుధ
చిరంజీవి .. బాలకృష్ణ .. నాగార్జున కుటుంబాలకి చెందిన 3 తరాల ఆర్టిస్టులతో కలిసి నేను పనిచేశాను .. అది నా రికార్డు. అలాంటి రికార్డు ప్రగతికి ఉందా? పవిత్ర లోకేశ్ కి వుందా? ఎనో విజయవంతమైన సినిమాలు .. చెప్పుకోదగిన పాత్రలను నేను చేశాను. ప్రగతిగానీ .. పవిత్ర లోకేశ్ గాని ఒక వస్తువులా సీన్లో నుంచునే పాత్రలను చేస్తున్నారు. అలాంటి పాత్రలను చేస్తున్నవాళ్లను చూసి నాకు జాలి అనిపిస్తోంది. కేరక్టర్స్ పరంగా చూసుకుంటే వాళ్లెప్పుడూ సుధకి సమానం కాలేరు. పొగరనుకున్నా ఫరవాలేదు .. 200 శాతం నిజం చెబుతున్నాను" అని అన్నారు.