Mahesh Babu: దక్షిణాదిన మహేశ్‌ బాబుకి రికార్డు స్థాయి ఫాలోవర్లు.. ఫ్యాన్స్ ఖుషీ

mahesh twitter followers
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్‌ హీరో మహేశ్‌ బాబు ట్విట్టర్‌ ఫాలోవర్ల సంఖ్య తొమ్మిది మిలియన్లకు (90 లక్షలు) చేరింది. దక్షిణాదిలో ఇంతమంది ఫాలోవర్లు ఉన్న మరో హీరో లేడు. తన సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు కుటుంబ విషయాలను కూడా ఆయన ట్విట్టర్‌లో షేర్‌ చేస్తుంటాడు. ఇటీవల సామాజిక అంశాలపై కూడా ఆయన స్పందిస్తూ ట్వీట్లు చేస్తున్నాడు.
                   
'9 మిలియన్లకు చేరింది.. ట్వీపుల్‌కి థ్యాంక్స్‌! ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగస్వాములయిన ప్రతి ఒక్కరికీ నా ప్రేమ, కృతజ్ఞతలు' అని మహేశ్ బాబు ట్వీట్ చేశాడు. దక్షిణాదిలో అందరి కంటే ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించుకున్న మహేశ్‌ను ఆయన అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఆయన ఫాలోవర్ల సత్తా ఏంటో అందరికీ తెలిసిందని ఆయన ఫొటోలను జత చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు.

        
Go Back to Shorts
Mahesh Babu
Tollywood
Twitter

More Telugu News