మహేశ్ బాబుకి మరో లైన్ వినిపించిన వంశీ పైడిపల్లి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహేశ్ బాబుకి మరో లైన్ వినిపించిన వంశీ పైడిపల్లి

Vamsi paidipalli Movie
  • ఏడాదిగా రెడీ చేసిన కథపట్ల మహేశ్ అసంతృప్తి
  • వంశీ పైడిపల్లి డీలాపడ్డట్టు ప్రచారం 
  • మరో లైన్ తో మెప్పించిన వంశీ పైడిపల్లి  
'సరిలేరు నీకెవ్వరు' తరువాత మహేశ్ బాబు .. వంశీ పైడిపల్లి సినిమా చేయవలసి వుంది. 'మహర్షి' సినిమా సమయంలోనే వంశీ పైడిపల్లికి ఇచ్చిన మాట ప్రకారం ఆయనతో కలిసి మహేశ్ బాబు సెట్స్ పైకి వెళ్లవలసి వుంది. అయితే స్క్రిప్ట్ నచ్చకపోవడం వలన మహేశ్ బాబు తన ఆలోచనను మార్చుకున్నాడు. తన తదుపరి సినిమాను పరశురామ్ తో చేయాలని నిర్ణయించుకున్నాడు. మహేశ్ బాబు తీసుకున్న ఈ నిర్ణయం .. ఈ విషయంపై జరిగిన ప్రచారం వంశీ పైడిపల్లిని చాలా బాధించాయనే టాక్ వినిపించింది.

అయితే వంశీ పైడిపల్లి మాత్రం జరిగినదానికి డీలా పడిపోకుండా, మరో లైన్ ను రెడీ చేసి, మహేశ్ బాబుకి వినిపించాడట. ఆయనకి లైన్ నచ్చేసి ఓకే అనడం కూడా జరిగిపోయిందని అంటున్నారు. అయితే పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ సిద్ధం చేయడమనేది ఇప్పట్లో అయ్యే పని కాదు గనుక, పరశురామ్ తరువాత సినిమాను తనతోనే మహేశ్ బాబు చేసేలా వంశీ పైడిపల్లి సెట్ చేసుకుంటున్నాడని చెప్పుకుంటున్నారు. సమస్యలను సహనంతోనే ఎదుర్కుంటాడనే పేరున్న వంశీ పైడిపల్లి, ఆ విషయాన్ని మరోసారి నిరూపించాడన్న మాట.
Mahesh Babu
Parashuram
Vamsi paidipalli Movie

More Telugu News