తాలిబాన్ చీఫ్ తో 35 నిమిషాల పాటు మాట్లాడిన ట్రంప్!
- తాలిబాన్ చీఫ్ బరాదర్ తో ఫోన్ లో మాట్లాడిన ట్రంప్
- మంచి చర్చ జరిగిందని ప్రకటించిన అమెరికా అధినేత
- హింసను విడనాడాలని వారు కూడా భావిస్తున్నారంటూ వ్యాఖ్య
బరాదర్ తో చర్చలు జరిపిన విషయాన్ని వాషింగ్టన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ట్రంప్ వెల్లడించారు. తాలిబాన్ నేతతో ఈ రోజు మంచి చర్చ జరిగిందని ఆయన చెప్పారు. బరాదర్ తో ఇంతకు ముందు కూడా మాట్లాడారా? అని మీడియా ప్రశ్నించగా... ఆ విషయం గురించి మాట్లాడదలుచుకోలేదని అన్నారు. ముల్లా బరాదర్ తో మంచి సంబంధం నెలకొందని చెప్పారు. హింసకు తావు లేకుండా చేయాలని వారు కూడా అనుకుంటున్నారని తెలిపారు.
ఆఫ్ఘనిస్థాన్ నుంచి విడతల వారీగా తమ బలగాలను ఉపసంహరించుకోవాలని అమెరికా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే, ఆఫ్ఘాన్ లో శాంతిని నెలకొల్పే దిశగా తాలిబాన్ నేతతో ట్రంప్ చర్చలు జరిపారు.