ఏపీలో రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు.... సర్వం సిద్ధం
- అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్న ఇంటర్ కార్యదర్శి
- హాల్ టికెట్లపై ప్రిన్సిపాల్ సంతకం అవసరంలేదని వెల్లడి
- జంబ్లింగ్ విధానంలో ఇన్విజిలేటర్ల నియామకం
కాగా, ఈసారి మొత్తం 10.65 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు. అందుకోసం రాష్ట్రంలో 1,411 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 105 సమస్యాత్మక పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఉంటుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. పూర్తిస్థాయి జంబ్లింగ్ విధానంలో ఇన్విజిలేటర్ల నియామకం ఉంటుందని పేర్కొన్నారు. హాల్ టికెట్లపై కాలేజీ ప్రిన్సిపాల్ సంతకం అవసరంలేదని అన్నారు.
విద్యార్థుల సౌకర్యార్థం 'యువర్ ఎగ్జామ్ సెంటర్' అనే యాప్ రూపొందించామని వెల్లడించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని చెప్పారు. 1800 2749868, 0866 2974130 నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదులు చేయవచ్చని వివరించారు. అంతేకాదు, 9391282578 నెంబర్ కు వాట్సాప్ ద్వారా సమస్యలు నివేదించవచ్చని తెలిపారు.