భారత్ తో బలమైన బంధం: చైనా ప్రధాని లీ
భారత్ తో సహకార బంధాన్ని మరింత బలపరచుకోవాలని కోరుకుంటున్నట్లు చైనా ప్రధాని లీ కెకియాంగ్ అన్నారు. ఉదయం ప్రధాని మన్మోహన్ తో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ప్రధాని అయ్యాక తొలిగా భారత్ కు రావడం భారత్ తో బంధానికి చైనా ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనమన్నారు. పరస్పర విశ్వాసం, సహకారాన్ని మరింతగా విస్తరించుకోవడం, భవిష్యత్ నిర్దేశనం ఈ మూడు అంశాలే తన పర్యటన విశేషాలని చెప్పారు.