డిగ్రీ విద్యార్థినిపై రైల్వే గార్డు అత్యాచారం.. నిందితుడిని పట్టించిన భార్య

Railway gaurd raped degree student
  • బ్లాక్‌మెయిల్‌ చేస్తూ పలుమార్లు అత్యాచారం
  • విషయం తెలిసి భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య
  • పోలీసుల అదుపులో నిందితుడు
డిగ్రీ విద్యార్థినిని బ్లాక్‌మెయిల్ చూస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని అతడి భార్యే పోలీసులకు పట్టించింది. విజయవాడలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. తాడేపల్లికి చెందిన అనిల్ కుమార్ (40) రైల్వే గార్డుగా పనిచేస్తున్నాడు. తన ఇంటి ఎదురుగా ఉండే డిగ్రీ విద్యార్థినిని ఆకర్షించి లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆమె ఫొటోలు తన ఫోన్‌లో ఉన్నాయని చెప్పాడు. భయపడిన ఆమె చూసేందుకు ఆయన ఇంటికి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన నిందితుడు ఆమెను భయపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో మరిన్ని ఫొటోలు తీసి ఆమెను బ్లాక్‌మెయిల్ చేసి పలుమార్లు లొంగదీసుకున్నాడు.

అక్కడితో ఆగని నిందితుడు ఈ నెల 1న బాధితురాలు చదువుకుంటున్న కాలేజీకి వెళ్లి ఫొటోలు చూపించి బెదిరించాడు. అక్కడి నుంచి ఆమెను హోటల్‌కు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన అనిల్ కుమార్ భార్య దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించింది. స్పందించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Vijayawada
Tadepalli
Rape
Student
Crime News

More Telugu News