అమరావతి రైతుల పరిస్థితిపై కోదండరాం వ్యాఖ్యలు
- ఏ రైతును కదిలించినా కన్నీళ్లే వస్తున్నాయని వ్యాఖ్యలు
- రైతుల పట్ల ప్రభుత్వ వైఖరి మారాలని హితవు
- ఎక్కడ సచివాలయం ఉంటే అదే రాజధాని అన్న కోదండరాం
ప్రస్తుతం అమరావతిలో పరిణామాలు చూస్తుంటే ఎంతో బాధగా ఉందన్నారు. ఏ రైతును కదిపినా, ఏ మహిళను అడిగినా కన్నీళ్లతో బదులిస్తున్నారని కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని రైతుల పట్ల ఏపీ ప్రభుత్వం వైఖరి మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో రాజధానిగా అమరావతిని ప్రకటించినప్పుడు స్వాగతించారని పేర్కొన్న కోదండరాం, ఎమ్మెల్యేలు, అధికారుల బృందం ఓసారి అమరావతిలో పర్యటించాలని సూచించారు.