Vijay Sai Reddy: ప్రజలు ఉమ్మేస్తారన్న సిగ్గు కూడా లేకుండా ప్రవర్తిస్తున్నావు: విజయసాయిరెడ్డి

vijaya sai reddy fires on chandra babu naidu
షార్ట్స్‌లో చూడండి
ప్రజా చైతన్య యాత్రలో భాగంగా విశాఖపట్నంలో పర్యటించాలనుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెనక్కి తగ్గకపోవడంతో ఆయనపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉత్తరాంధ్ర ప్రజల నోటి దగ్గరి ముద్దను లాక్కునేలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.

'ప్రజలు ఉమ్మేస్తారన్న సిగ్గు కూడా లేకుండా ప్రవర్తిస్తున్నావు చంద్రబాబూ. నిర్లక్ష్యానికి గురైన ఉత్తరాంధ్రను పరిపాలనా రాజధాని చేయాలని సీఎం జగన్ గారు నిర్ణయిస్తే దాన్ని వ్యతిరేకిస్తూ బస్సు యాత్రకు బయలుదేరతావా? అమరావతి కోసం ఉత్తరాంధ్ర  ప్రజల నోటి దగ్గర ముద్దను లాక్కుంటావా?' అని ప్రశ్నించారు.
Go Back to Shorts
Vijay Sai Reddy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News