Vijay Sai Reddy: మీరు తాగే హిమాలయ వాటర్ కు మాత్రం కోట్లు పోశావు కదా బాబూ!: విజయసాయిరెడ్డి

vijaya sai reddy fires on chandra babu naidu
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలో విద్యార్థుల కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారని ఆయన చెప్పారు. గత సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం తాను తాగే హిమాలయ వాటర్ కు కోట్ల రూపాయలు ఖర్చు చేశారని చెప్పారు.

'జగనన్న గోరుముద్ద, అమ్మ ఒడి కింద ఏటా 15 వేల రూపాయలు, కాలేజీల విద్యార్థులకు 20 వేల వసతి దీవెన, ఇంగ్లిష్ మీడియంలో బోధన. విద్యార్థుల భవిష్యత్తు కోసం రూపొందించిన ఇన్ని పథకాలు ఏ రాష్ట్రంలో కనిపించవు. పిల్లల నోరుకొట్టి మీరు తాగే హిమాలయ వాటర్ కు మాత్రం కోట్లు పోశావు కదా బాబూ!' అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Vijay Sai Reddy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News