ప్రశాంత్ కిశోర్‌పై కుమారస్వామి చూపు.. రెండు దఫాలుగా చర్చలు
- 2023 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే రెడీ అవుతున్న జేడీఎస్
- ప్రశాంత్ కిశోర్‌తో చర్చలు జరుపుతున్నట్టు వెల్లడించిన కుమారస్వామి
- సొంతంగా అధికారంలోకి వస్తామని ధీమా
ఇందులో భాగంగా ప్రశాంత్ కిశోర్‌తో సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పటికే రెండు విడతలుగా ఆయనతో చర్చలు జరిపినట్టు స్వయంగా కుమారస్వామే వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం ప్రశాంత్ కిశోర్ తమకు ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. తాము సొంతంగానే అధికారంలోకి వస్తామని కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు.