'ఆనందం' సినిమాలో అలా అవకాశం వచ్చింది: హీరోయిన్ రేఖ వేదవ్యాస్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఆనందం' సినిమాలో అలా అవకాశం వచ్చింది: హీరోయిన్ రేఖ వేదవ్యాస్

Anandam Movie
  • నేను పుట్టి పెరిగింది ' ఉడిపి'లో
  • మోడలింగ్ చేసేదానిని  
  • తన తొలి సినిమా కన్నడలో 'చిత్ర' అని చెప్పిన రేఖ
తెలుగులో వచ్చిన గుర్తుండిపోయే ప్రేమకథా చిత్రాల్లో 'ఆనందం' ఒకటి. ఆ సినిమాతో కథానాయికగా రేఖ తెలుగు తెరకి పరిచయమైంది. ఆ తరువాత ఇక్కడ ఓ పది సినిమాల వరకూ చేసింది. తెలుగుతో పాటు కన్నడ .. తమిళ .. హిందీ సినిమాల్లోను మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ..'నేను పుట్టి పెరిగింది 'ఉడిపి'లో. సినిమాల్లోకి రావడానికి ముందు నేను మోడలింగ్ చేసేదానిని. మోడలింగ్ కారణంగానే నాకు కన్నడలో 'చిత్ర' సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. తెలుగులో వచ్చిన 'చిత్రం' సినిమాకి అది రీమేక్. కన్నడ సినిమాకి కూడా నిర్మాత రామోజీరావుగారే. ఆ సినిమా రష్ చూసిన తరువాత నన్ను 'ఆనందం' సినిమా కోసం తీసుకున్నారు. అలా 'ఆనందం' సినిమాలో నాకు అవకాశం వచ్చింది. ఆ సినిమా పెద్ద హిట్ కావడంతో నాకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఆ తరువాత నేను కన్నడ సినిమాలతో బిజీ కావడం వలన, ఆశించిన స్థాయిలో తెలుగులో సినిమాలు చేయలేకపోయాను" అని చెప్పుకొచ్చింది.
Rekha
Anandam Movie
Tollywood

More Telugu News