నేడు ట్రంప్ కు రాష్ట్రపతి ప్రత్యేక విందు.. హాజరుకానున్న సీఎం కేసీఆర్
- రాష్ట్రపతి భవన్ లో ప్రత్యేక విందుకు ఏర్పాట్లు
- ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్న కేసీఆర్
- ట్రంప్ దంపతులకు కానుకలు అందజేయనున్న సీఎం
ఈ ఆహ్వానం మేరకు విందులో పాల్గొనేందుకు కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారు. ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళతారని సమాచారం. ఈ సందర్భంగా ట్రంప్ దంపతులకు, కూతురు ఇవాంకకు కేసీఆర్ కానుకలు అందించనున్నట్టు సమాచారం. కాగా, రాష్ట్రపతి గౌరవార్థం ఇస్తున్న ఈ విందులో మొత్తం 90 నుంచి 95 మంది వీఐపీలు మాత్రమే పాల్గొంటారని తెలుస్తోంది. కేసీఆర్ సహా మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, అసోం, హర్యానా, బీహార్ ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు.