హీరోయిన్ రష్మిక ఫొటోకు 'చించావ్ లే పో' అంటూ కామెంట్ చేసిన వ్యక్తి అరెస్టు
- కలెక్టర్ ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసి కామెంట్
- నిందితుడి పేరు శ్రీనివాస్
- 2018లో కలెక్టర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
- నిందితుడి మొబైల్ ఫోన్ స్వాధీనం
2018లో కలెక్టర్ ట్విట్టర్ అకౌంట్‌ను శ్రీనివాస్ హ్యాక్ చేసి, అప్పటి నుంచి దాన్ని ఆపరేట్ చేస్తున్నాడని పోలీసులు వివరించారు. ఇటీవల సినీనటి రష్మిక మందన్న ఫొటోకు కామెంట్ చేశాడని తెలిపారు. నిందితుడు శ్రీనివాస్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్‌లో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు. కాగా, తాను ఆ కామెంట్ చేయలేదని కలెక్టర్ రవి ఇప్పటికే స్పష్టం చేశారు.