ఇన్ని బాటిళ్లు నేనొక్కడినే తాగలేను... సాయం కావాలి: రాస్ టేలర్
- న్యూజిలాండ్ ఆటగాడు రాస్ టేలర్ అరుదైన రికార్డు
- అన్ని ఫార్మాట్లలో వందేసి మ్యాచ్ లు ఆడిన క్రికెటర్ గా ఘనత
- 100 వైన్ బాటిళ్లు కానుకగా ఇచ్చిన సహచరులు
ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ జట్టు సహచరులు టేలర్ కు అద్భుతమైన బహుమతి ఇచ్చారు. మాజీ ఆటగాడు ఇయాన్ స్మిత్ చేతులమీదుగా 100 వైన్ బాటిళ్లను బహూకరించారు. దీనిపై రాస్ టేలర్ స్పందించాడు. ఇన్ని బాటిళ్లు ఇవ్వడం కాస్త అతిశయంగా అనిపిస్తోందని అన్నాడు. కానీ, ఈ బాటిళ్లన్నీ తాను తాగలేనని, ఎవరైనా సాయం చేయాలని చమత్కరించాడు.