త్రివిక్రమ్ తో ఎన్టీఆర్.. పరిశీలనలో పూజా హెగ్డే .. రష్మిక పేర్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

త్రివిక్రమ్ తో ఎన్టీఆర్.. పరిశీలనలో పూజా హెగ్డే .. రష్మిక పేర్లు

Trivikram Movie
  • త్రివిక్రమ్ తో రెండు సినిమాలు చేసిన పూజా హెగ్డే 
  • వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక 
  •  త్వరలోనే పట్టాలెక్కనున్న ప్రాజెక్టు   
త్రివిక్రమ్ తన తదుపరి సినిమాను ఎన్టీఆర్ తో చేయనున్నాడనే విషయం ఖరారైపోయింది. కథపై కసరత్తు పూర్తి కాగానే, ఎన్టీఆర్ తో కలిసి ఆయన సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా ఎవరికి ఛాన్స్ దొరుకుతుందనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతూ పోతోంది. ఈ నేపథ్యంలోనే పూజా హెగ్డే .. రష్మిక పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

త్రివిక్రమ్ ఇంతకుముందు చేసిన 'అరవింద సమేత 'లోను .. 'అల వైకుంఠపురము'లోను కథానాయికగా పూజా హెగ్డేనే చేసింది. ఈ రెండు సినిమాలు విజయవంతం కావడం వలన, ఆ సెంటిమెంటుతో మళ్లీ ఆమెను తీసుకోవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఇక మరో వైపున రష్మిక కూడా వరుస హిట్లతో తన జోరు చూపిస్తోంది. అందువలన జోడీ కొత్తగా అనిపిస్తుందనే ఉద్దేశంతో ఆమెను ఎంపిక చేసే అవకాశాలు కూడా ఎక్కువేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Trivikram
Junior NTR
Pooja Hegde
Rashmika Mandanna

More Telugu News