అసెంబ్లీ కార్యదర్శిపై మండలి చైర్మన్ కక్ష సాధిస్తున్నారు: సీఎస్ కు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడి ఫిర్యాదు

AP Secretariat employees complains to CS over Sharif
సెలెక్ట్ కమిటీల ఏర్పాటు ఫైలును ఏపీ అసెంబ్లీ కార్యదర్శి తిప్పి పంపడంపై మండలి చైర్మన్ షరీఫ్ సీరియస్ గా వున్న విషయం విదితమే. ఈ విషయమై ఆయన గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో, మండలి చైర్మన్ షరీఫ్ అసెంబ్లీ కార్యదర్శి పట్ల కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన సీఎస్ నీలం సాహ్నీకి ఫిర్యాదు చేశారు. నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటున్న అసెంబ్లీ కార్యదర్శిని బెదిరించడం, మానసికంగా వేధించడం చేస్తున్నారని తెలిపారు. అసెంబ్లీ కార్యదర్శికి తాము మద్దతుగా నిలుస్తామని, ఈ విషయంలో గవర్నర్ వరకు వెళతామని వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు.
Go Back to Shorts
Venkatramireddy
AP Secretariat
Employees
AP Legislative Council
Shariff Mohammed Ahmed
CS
Nilam Sahni

More Telugu News