ఆ తండ్రీ కొడుకులను జైలుకు పంపడమే జగన్ టార్గెట్: దేవినేని ఉమ

Jagan targets chandrababu
అనునిత్యమూ ప్రజా సంక్షేమం కోసమే తాపత్రయపడుతూ ఉండే చంద్రబాబునాయుడిని, ఆయన కుమారుడు లోకేశ్ ను జైలుకు పంపాలని సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తండ్రీకొడుకులను కటకటాల వెనక్కు పంపాలని జగన్, చాలా కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, తెలుగుదేశం పార్టీ నాయకుల భద్రతను తగ్గించారని ఆరోపించారు. టీడీపీ ముఖ్య నేతలను చంపాలని జగన్ ప్రయత్నిస్తున్నారని, తమను ప్రజలే రక్షించుకుంటారని వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Chandrababu
Jagan
Devineni Uma
Nara Lokesh

More Telugu News