అధికారం, హోదా వచ్చాక మనిషి మారకూడదు: సీఎం కేసీఆర్
- కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులనుద్దేశించి ప్రసంగం
- లేని గొప్పదనం, ఆడంబరాలు తెచ్చుకోవద్దని హితవు
- ప్రస్తుతం రాజకీయాలు చాలా సులభం అయ్యాయని వ్యాఖ్యలు
అధికారం, హోదా వచ్చాక మనిషి మారకూడదని, లేని గొప్పదనాన్ని, ఆడంబరాన్ని తెచ్చుకోవద్దని హితవు పలికారు. ఐదు కోట్ల మందిలో 140 మందికే మేయర్లు, చైర్ పర్సన్లు అయ్యే అవకాశం వచ్చిందని, దీన్ని ఒక సోపానంగా భావించి సానుకూలంగా భావించగలిగితే ప్రజాజీవితంలో ఎంత ముందుకైనా పోవచ్చని, అది మీ చేతుల్లోనే ఉందని తెలిపారు. ప్రజా జీవితం అనుకున్నంత సులభం కాదని, తామ చేసేపనిపై స్పష్టత ఉండాలని పేర్కొన్నారు.