భార్యలేని జీవితం వద్దనుకుని.. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న భర్త
- 18 నెలల క్రితం వివాహం
- కుమార్తెకు జన్మనిచ్చిన నాలుగు రోజులకే భార్య మృతి
- ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువకుడు
దీంతో చిన్నారి బాగోగులను భీమ్ తల్లిదండ్రులు చూసుకుంటున్నారు. మరోవైపు, భార్య మరణంతో తీవ్ర కలతకు గురైన భీమ్.. ఆమె లేని జీవితాన్ని ఊహించుకోలేకపోయాడు. నిత్యం ఆమె ఆలోచనలతోనే గడిపాడు. నిన్న సాయంత్రం తీవ్ర మనస్తాపానికి గురైన భీమ్.. ఇంట్లోనే ఉరివేసుకుని తనువు చాలించాడు. ఉరికి వేలాడుతున్న కుమారుడిని చూసిన తల్లిదండ్రులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.