టీఆర్ఎస్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇంటిపై దాడి... తీవ్ర ఉద్రిక్తత!
- వెల్దండ పీఏసీఎస్ చైర్మన్ పదవిని ఆశించిన సంజీవ్ కుమార్
- తన వర్గీయులతో కలిసి జైపాల్ ఇంటివద్ద నిరసన
- అద్దాలు ధ్వంసం చేయడంతో రంగంలోకి పోలీసులు
దీంతో తన అనుచరులను వెంటేసుకుని జైపాల్ ఇంటికి చేరుకున్న సంజీవ్ కుమార్, నినాదాలు చేస్తూ, ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. ఆపై తన వర్గీయులతో కలిసి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని సంజీవ్ కుమార్ అనుచరులను చెదరగొట్టి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. జైపాల్ ఇంటివద్ద భద్రతను పెంచారు.