‘అరణ్య’ టీజర్ లో అదరగొట్టిన రానా
- తెలుగు, తమిళం,హిందీల్లో రూపొందుతున్న చిత్రం
- ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు
- యాక్షన్, వినోదం ప్రధానంగా సాగే చిత్రం
ఈ సినిమా టీజర్ లో రానా డిఫరెంట్ లుక్ తో అలరించాడు. అడవిలో ఏనుగులను మచ్చిక చేసుకుని వాటితో సహవాసం చేసే అడవి తెగకు చెందిన వ్యక్తిగా ఆయన లుక్ ఉంది. మనిషి స్వార్థం కోసం అడవులను ధ్వంసం చేస్తుండడంతో అడవుల్లో నివసించే ప్రాణుల మనుగడకు ముప్పు ఏర్పడిందని.. ముఖ్యంగా ఏనుగులు మనుగడ కోల్పోయే పరిస్థితి ఏర్పడటంపై హీరోగా రానా చేసే పోరాటమే చిత్ర కథగా తెరకెక్కింది. ఈ సినిమా హిందీలో ‘హాథీ మేరా సాథి’, తమిళంలో ‘కాదన్’గా విడుదల కానుంది.