Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తీసుకున్న డబ్బులు ఇవ్వమంటే గూండాలను పంపి బెదిరిస్తున్నాడు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన టీవీ యాంకర్ రవి

  • సినీ పరిశ్రమకు చెందిన సందీప్ అనే వ్యక్తిపై ఫిర్యాదు
  • రూ. 45 లక్షలు అప్పుగా తీసుకుని కొంత మాత్రమే వెనక్కి ఇచ్చాడన్న యాంకర్
  • తానెక్కడికి వెళ్లినా అతడి మనుషులు అనుసరిస్తారన్న రవి
అప్పుగా తీసుకున్న డబ్బులను వెనక్కి ఇవ్వమంటే గూండాలను పంపి బెదిరిస్తున్నాడంటూ సందీప్ అనే వ్యక్తిపై టీవీ యాంకర్ రవి కూకట్‌పల్లి పోలీసులకు నిన్న సాయంత్రం ఫిర్యాదు చేశాడు. సినీ పరిశ్రమకు చెందిన సందీప్ తన వద్ద రూ.45 లక్షలు అప్పుగా తీసుకున్నాడని, కొన్ని రోజుల తర్వాత కొంత డబ్బులు వెనక్కి ఇచ్చాడని, ఇంకా కొంత సొమ్ము రావాల్సి ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రవి పేర్కొన్నాడు. అయితే, మిగతా డబ్బులు అడుగుతుంటే ఇవ్వకపోగా, బెదిరిస్తున్నాడని ఆరోపించాడు. తాను ఎక్కడికి వెళ్లినా సందీప్ మనుషులు అనుసరిస్తూ బెదిరిస్తున్నారని పేర్కొన్నాడు.  

అంతేకాదు.. తాను ఎక్కడికెళ్లినా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులను పంపి బెదిరిస్తున్నాడని రవి చెప్పుకొచ్చాడు. అయితే తన దగ్గర తీసుకున్నట్లే చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్న సందీప్ వారిని కూడా ఇలాగే మోసం చేశాడని తెలిసిందన్నాడు. రవి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Anchor Ravi
Kukatpally
Crime News
Hyderabad
Tollywood

More Telugu News