తీసుకున్న డబ్బులు ఇవ్వమంటే గూండాలను పంపి బెదిరిస్తున్నాడు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన టీవీ యాంకర్ రవి
- సినీ పరిశ్రమకు చెందిన సందీప్ అనే వ్యక్తిపై ఫిర్యాదు
- రూ. 45 లక్షలు అప్పుగా తీసుకుని కొంత మాత్రమే వెనక్కి ఇచ్చాడన్న యాంకర్
- తానెక్కడికి వెళ్లినా అతడి మనుషులు అనుసరిస్తారన్న రవి
అంతేకాదు.. తాను ఎక్కడికెళ్లినా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులను పంపి బెదిరిస్తున్నాడని రవి చెప్పుకొచ్చాడు. అయితే తన దగ్గర తీసుకున్నట్లే చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్న సందీప్ వారిని కూడా ఇలాగే మోసం చేశాడని తెలిసిందన్నాడు. రవి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.