జగన్ భక్తుడ్నని కాదు, క్రికెట్ బెట్టింగుకు వీరభక్తుడ్నని ప్రకటిస్తే బాగుండేది: మంత్రి అనిల్ పై టీడీపీ ఎమ్మెల్సీ సెటైర్లు
- చంద్రబాబుపై మంత్రి అనిల్ ఆవేశం
- జగన్ మూడో కన్ను తెరిస్తే భస్మమైపోతాడని వ్యాఖ్యలు
- అనిల్ వ్యాఖ్యలపై స్పందించిన సత్యనారాయణరాజు
- ముందు పోలవరంలో తట్టెడు మట్టి తవ్వి చూపించాలని వ్యంగ్యం
అంతేకాదు, పూడుస్తాం, పాతేస్తాం అంటూ ఆగ్రహం చూపిస్తున్న అనిల్ కుమార్ మొదట పోలవరం ప్రాజెక్టులో తట్టెడు మట్టి తవ్వి చూపించాలని ఎద్దేవా చేశారు. "శివ అనే వ్యక్తి ఏర్పాటు చేసిన పార్టీని కబ్జా చేసింది ఎవరో చెప్పాలని సీఎం జగన్ ను నిలదీయాలి. ఆ పార్టీ నుంచి బయటికి వచ్చి సొంత పార్టీ పెట్టి తమను గెలిపించాలని సీఎం జగన్ కు సవాల్ విసరాలి" అంటూ అనిల్ కు సూచించారు.