నిర్భయ దోషులకు హైకోర్టు వారం గడువు.. స్వాగతించిన నిర్భయ తల్లి
- కేంద్రం పిటిషన్ను కొట్టివేసిన కోర్టు
- దోషులకు ఉరి తప్పదన్న విశ్వాసం కలిగింది
- కోర్టు తీర్పుపై ఆశాదేవి హర్షం
ఢిల్లీ హైకోర్టు తీర్పుపై నిర్భయ తల్లి ఆశాదేవి స్పందించారు. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ఈ తీర్పుతో దోషులకు ఉరితప్పదన్న నమ్మకం కలిగిందన్నారు. చట్టపరంగా దోషులకు ఉన్న అవకాశాలను వినియోగించుకునేందుకు వారికి వారం రోజుల గడువు ఇచ్చిందని, ఈ తీర్పుతో వారికి ఉరి తప్పదని విశ్వాసం వ్యక్తం చేశారు.