'జబర్దస్త్' వేరు .. సినిమా వేరు: గెటప్ శ్రీను
- ఫ్రెండ్స్ తో కలిసి నటించడం ఆనందంగా వుంది
- 'త్రీ మంకీస్' అందరికీ నచ్చుతుంది
- తమ కెరియర్ కి హెల్ప్ అవుతుందన్న శ్రీను
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. "నా స్నేహితులైన సుధీర్ .. రామ్ ప్రసాద్ తో కలిసి ఈ సినిమా చేయడం ఆనందంగా వుంది. ఈ సినిమాలో నేను ఏ గెటప్ లోను కనిపించను .. నేను నాలానే వుంటాను. సినిమాల్లో అవసరమైతే తప్ప గెటప్పులలో కనిపించాలని అనుకోవడంలేదు. ఎందుకంటే 'జబర్దస్త్' వేరు .. సినిమా వేరు. అక్కడిలా ఇక్కడ కనిపించాలనుకోవడం కుదరదు. 'త్రీమంకీస్' అందరికీ నచ్చుతుందనీ, మా ముగ్గురి కెరియర్ కి హెల్ప్ అవుతుందని భావిస్తున్నాము" అని చెప్పుకొచ్చాడు.