Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీహార్‌లో కిడ్నాపైన మహిళ.. తన తల్లిని రక్షించాలంటూ కేటీఆర్‌కు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వినతి!

  • చంపారన్ జిల్లాలో కిడ్నాపైన మహిళ
  • యువతి ట్వీట్‌కు స్పందించిన మంత్రి కేటీఆర్
  • బీహార్ డీజీపీతో మాట్లాడి ఆమె ఆచూకీ కనుగొనాలని సూచన
బీహార్‌లో కిడ్నాపైన తన తల్లిని రక్షించాలంటూ హైటెక్ సిటీలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఒకరు ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్‌ను కోరారు. స్పందించిన కేటీఆర్.. ఆమె సురక్షితంగా ఇంటికి తిరిగి వస్తుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్, హైటెక్ సిటీలో గరిమ అనే యువతి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. బీహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లా రక్షాహులో ఆమె తల్లిని కొందరు దుండగులు కిడ్నాప్‌ చేశారు. విషయం తెలిసిన ఆమె వెంటనే ఐటీ మంత్రి కేటీఆర్ సాయం అర్థించింది. ఆమె ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్.. బీహార్ డీజీపీని సంప్రదించి విషయం తెలియజేశారు. గరిమ తల్లి ఆచూకీ కనుగొని, రక్షించాలని కోరారు. మీ తల్లి క్షేమంగా తిరిగి వస్తారంటూ గరిమకు భరోసా ఇచ్చారు.
Bihar
kidnap
KTR
woman

More Telugu News