వంద విమానాశ్రయాలకు మహర్దశ... రైల్వే వ్యవస్థ ఆధునికీకరణ: నిర్మలాసీతారామన్
- కేంద్ర బడ్జెట్లో రవాణా రంగానికి పెద్దపీట
- మౌలిక సదుపాయాల కల్పనకు రూ.1.7 లక్షల కోట్లు కేటాయింపు
- రైల్వే ట్రాక్ పక్కన సోలార్ విద్యుత్ కేంద్రాలు
బెంగళూరులో 18,600 కోట్లతో నిర్మించ తలపెట్టిన మెట్రో తరహా సబర్బన్ రైలు ఏర్పాటుకు కేంద్రం 20 శాతం నిధుల సాయం అందిస్తుందని ప్రకటించారు. ముంబయి-అహ్మాదాబాద్ మధ్య నడపనున్న హైస్పీడ్ రైళ్లను మరికొన్ని ముఖ్యకేంద్రాల మధ్య నడపనున్నట్లు ప్రకటించారు.
చెన్నై- బెంగళూరు మధ్య కొత్త ఎక్స్ప్రెస్ వే ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రధాన పర్యాటక కేంద్రాలను కలుపుతూ తేజస్ లాంటి రైళ్లను ఏర్పాటు చేస్తామని, రైలు మార్గాలకు ఇరువైపులా వీలున్న చోట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.