పార్లమెంటులో టీడీపీ గది వైసీపీకి కేటాయింపు!

ఢిల్లీలోని పార్లమెంట్‌ భవనంలో తెలుగుదేశం పార్టీకి కేటాయించిన గదిని మారుస్తూ స్పీకర్‌ నిర్ణయం తీసుకున్నారు. గతంలో టీడీపీకి ఐదో నంబరు గదిని కేటాయించారు. ఈ గదిని తాజాగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు స్పీకర్‌ పక్రటించారు. అదే సమయంలో టీడీపీకి 118వ నంబరు గది కేటాయించారు. ఈ నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ ఎంపీలు భగ్గుమంటున్నారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతుండడంతో ఈ విషయమై మాట్లాడడం బాగోదని మిన్నకున్నారు. సమావేశాల అనంతరం మీడియా ముందు తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని నిర్ణయించారు.

parlement bhavan
Telugudesam
YSRCP
room no.5

More Telugu News