ఇండస్ట్రీలో నేను అంత తక్కువ వాడినా అనిపించింది: హీరో శర్వానంద్ ఆవేదన

 Sharwanand Felt Undervalued in Industry After Accident
షార్ట్స్‌లో చూడండి

టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్ తన కెరీర్‌లో ఎదురైన అత్యంత కష్టమైన దశ గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదం, ఆ తర్వాత ఎదుర్కొన్న ఒంటరితనం తనను ఎంతగానో కలిచివేసిందని ఆయన వెల్లడించారు.


'జాను' సినిమా షూటింగ్ సమయంలో థాయ్‌లాండ్‌లో స్కైడైవింగ్ శిక్షణ తీసుకుంటుండగా శర్వానంద్‌కు ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆయన భుజం ఎముక విరిగిపోయింది. దీని కోసం అత్యంత క్లిష్టమైన సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది.


దీని గురించి శర్వానంద్ మాట్లాడుతూ... సినిమా కోసం ప్రాణాలకు తెగించి సాహసం చేసినా, పరిశ్రమలో గానీ, బయట గానీ ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడం తనను బాధించిందని శర్వానంద్ అన్నారు. "పెద్ద హీరోలకు చిన్న దెబ్బ తగిలినా సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది. కానీ నేను అంత పెద్ద సర్జరీ చేయించుకున్నా ఎవరూ స్పందించలేదు. నేను ఇండస్ట్రీలో అంత తక్కువ వాడినా అనిపించింది" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.


ఆ సమయంలో ఎదురైన పరిస్థితి తనను మానసికంగా కుంగదీసిందని, తన కష్టానికి తగిన గుర్తింపు లభించలేదనే బాధ ఇప్పటికీ ఉండిపోయిందని పేర్కొన్నారు. శర్వానంద్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన పడిన కష్టాన్ని గుర్తించిన నెటిజన్లు, అభిమానులు శర్వానంద్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. "మీరు నిజమైన కష్టజీవి, 'బైకర్' విజయం మీ కష్టానికి దక్కిన ప్రతిఫలం" అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Go Back to Shorts
Sharwanand
Sharwanand interview
Jaanu movie
Sharwanand accident
Tollywood
Telugu cinema
Thailand skydive accident
Hero Sharwanand
Biker movie success
Sharwanand emotional

More Telugu News