తలుచుకున్నాను.. సాధించాను.. ఆరు నెలల్లో ఆకర్షణీయంగా మారిన నాగబాబు!
- వైరల్ గా మారిన నాగబాబు బరువు తగ్గిన ఫొటోలు
- పరిమిత ఆహారం, రెండు పూటలా వ్యాయామం
- వయసు, ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి
ఈ ఫొటోలకు అభిమానులనుంచి కామెంట్లు, లైక్ లు వెల్లువెత్తుతున్నాయి. బరువు తగ్గడానికి ప్రణాళిక ప్రకారం ఆహారం తీసుకోవడం.. వయసు, ఎత్తుకు తగ్గ బరువు మెయిన్ టెయిన్ చేయాలంటూ నాగబాబు తాను పాల్గొంటున్న షోల్లో నటీనటులకు సలహాలు ఇస్తుంటారు. అయితే, ఇతరులకు చెప్పేముందు తాను కూడా అనుసరించాలని నిర్ణయించుకుని బరువు తగ్గి ఆకర్షణీయంగా తయారయ్యారు. రోజుకు ఒక పూట మాత్రమే తింటూ ఉదయం, సాయంత్రం రెండు గంటల పాటు వ్యాయామం చేస్తానని నాగబాబు తెలిపారు.