'చచ్చిపోతా' అంటూ తెలుగు హీరోయిన్ పోస్ట్.. షాక్ అవుతోన్న నెటిజన్లు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'చచ్చిపోతా' అంటూ తెలుగు హీరోయిన్ పోస్ట్.. షాక్ అవుతోన్న నెటిజన్లు!

  • నచ్చావులే సినిమాతో నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నటి మాధవీలత
  •  ప్రేమ సినిమాలో రేవతిలా తాను చచ్చిపోతానని పోస్ట్  
  • తనను మైగ్రేన్ తలనొప్పి, నిద్రలేమి సమస్యలు బాధిస్తున్నాయని వ్యాఖ్య
  • ధైర్యంగా ఉండాలని సూచిస్తోన్న నెటిజన్లు 
నచ్చావులే సినిమాతో నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నటి మాధవీలత.. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో  బీజేపీలో చేరి ఎంపీగా పోటీ చేసి ఓడిన విషయం తెలిసిందే. అనారోగ్య కారణాలతో ఆమె తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లుంది. తన ఫేస్ బుక్ పేజీలో చచ్చిపోతానని సంచలన వ్యాఖ్యలు చేసి, కలకలం రేపుతోంది. తాను చచ్చిపోతాననే విషయాన్ని తన స్నేహితులతోనూ చెబుతూ ఉంటానని తెలిపింది.  

ఏదో ఒక రోజు 'ప్రేమ' సినిమాలో రేవతిలా తాను చచ్చిపోతానని పోస్ట్ చేసింది. తనను మైగ్రేన్ తలనొప్పి, జలుబు, జ్వరం, నిద్రలేమి వంటి సమస్యలు బాధిస్తున్నాయని తెలిపింది. మందులు వాడడం ఇష్టం లేకపోయినా వాడాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపింది. ఆమె పోస్ట్  చూస్తోన్న అభిమానులు షాక్ అవుతున్నారు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలని చనిపోవద్దని సూచించారు.

 కాగా, ప్రేమ సినిమాలో రేవతి ఎప్పుడూ ఎదో ఒక మెడిసిన్ వేసుకుంటూ ఉంటుంది. చివరికి ఎలాంటి మెడిసిన్ పని చేయకుండా చనిపోతుంది.
Tollywood
Facebook

More Telugu News